Lalita Ashtottara Shatanamavali in Telugu
Durga Puja Details:
తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
తేది:25-9-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
Lalita Tripura Sundari Puja ~ Navaratri Fifth Day - దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు.
నైవేద్యము:-
పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి- Lalita Ashtottara Shatanamavali
1. ఓం రజతాచలశృంగాగ్ర
మధ్యస్థాయై నమః
2. ఓం హిమాచల మహావంశపావనాయై
నమః
3. ఓం శంకార్ధాంగ సౌందర్య
శరీరాయై నమః
4. ఓం లసన్మరకత స్వచ్చ
విగ్రహాయై నమః
5. ఓం మహాతిశయ సౌందర్య
లావణ్యాయై నమః
6. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై
నమః
7. ఓం సదాపంచదశాత్మైక్య
స్వరూపాయై నమః
8. ఓం వజ్రమాణీక్య
కటకకిరీటాయై నమః
9. ఓం కస్తూరీతిలకోల్లాసి
నిటలాయై నమః
10.
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః
11.
ఓం వికచాంభోరుహ ధళలోచనాయై నమః
12.
ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమః
13.
ఓం లసత్కాంచనతాటంక యుగళాయై నమః
14.
ఓం మణీదర్పణ సంకాశ కపోలాయై నమః
15.
ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః
16.
ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమః
17.
ఓం కంబుపూగసమచ్చాయ కన్ధరాయై నమః
18.
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః
19.
ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమః
20.
ఓం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః
21.
ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమః
22.
ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమః
23.
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమః
24.
ఓం కన్కాంగదకేయూర భూషితాయై నమః
25.
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమః
26.
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః
27.
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః
28.
ఓం దివ్యభూషణ సందోహరంజితాయై నమః
29.
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః
30.
ఓం సుపద్మ రాగసంకాశ చరణాయై నమః
31.
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః
32.
ఓం శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయై నమః
33.
ఓం సచామర రమావాణీ రజితాయై నమః
34.
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
35.
ఓం భూతేశాలింగనోద్ఖూత పులకాంగ్యై నమః
36.
ఓం అనంగజనకాపాంగవీక్షణాయై నమః
37.
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్నరంజితాయై నమః
38.
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః
39.
ఓం లీలాకల్పితబ్రహ్మాండ మండలాయై నమః
40.
ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః
41.
ఓం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమః
42.
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
43.
ఓం దేవర్షిభిస్సూయమానవైభవాయై నమః
44.
ఓం కలశోద్భవ దుర్వాసః పూజితాయై నమః
45.
ఓం మత్తెభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమః
46.
ఓం శ్రీచక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమః
47.
ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః
48.
ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః
49.
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
50.
ఓం వందారు జనసందోహ వందితాయై నమః
51.
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
52.
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
53.
ఓం అవ్యాజకరుణా పూరపూరితాయై నమః
54.
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః
55.
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
56.
ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః
57.
ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమః
58.
ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః
59.
ఓం జాగ్రత్ స్వప్న సుఘప్తీనాం సాక్షిభూత్యై నమః
60.
ఓం మహాపాపౌఘ పాపానం వినాశిన్యై నమః
61.
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
62.
ఓం సమస్తదేవదనుజప్రేరకాయై నమః
63.
ఓం సమ్స్త హృదయాంభోజ నిలయాయై నమః
64.
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః
65.
ఓం సహస్రారసరోజాత వాసితాయై నమః
66.
ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమః
67.
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
68.
ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
69.
ఓం లోపాముద్రార్చిత శ్రీముచ్చరణాయై నమః
70.
ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమః
71.
ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
72.
ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్దిదాయై నమః
73.
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః
74.
ఓం శ్రీసుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమః
75.
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమః
76.
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః
77.
ఓం చంద్రశేఖర భక్తార్తిభంజనాయై నమః
78.
ఓం సర్వోపాధి వినిర్ముక్తచైతన్యాయై నమః
79.
ఓం నామపారాయణ భీష్టఫలదాయై నమః
80.
ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమః
81.
ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమః
82.
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
83.
ఓం భక్తహంసపరాముఖ్య వియోగాయై నమః
84.
ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః
85.
ఓం భండదైత్య మహాసత్త్వ నాశనాయై నమః
86.
ఓం క్రూరభండ శిరశ్చేద నిపుణాయై నమః
87.
ఓం ధాత్ర చ్యత సురాధీశ సుఖదాయై నమః
88.
ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః
89.
ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమః
90.
ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమః
91.
ఓం అభ్రకేశమహోత్సవా కారణాయై నమః
92.
ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః
93.
ఓం నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమః
94.
ఓం వృషభద్వజ విజ్ఞానభావనాయై నమః
95.
ఓం జన్మమృత్య జరారోగ భంజనాయై నమః
96.
ఓం విధేయముక్త విజ్ఞానసిద్దిదాయై నమః
97.
ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమః
98.
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
99.
ఓం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమః
100. ఓం వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః
101. ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమః
102. ఓం సాక్షాచ్చ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః
103. ఓం హయమేధాగ్రసంపూజ్య మహిమామ్నే నమః
104. ఓం దక్షప్రజాపతి సుతావేషాఢ్యాయై నమః
105. ఓం సుమబాణేక్షుకోదండ్మండితాయై నమః
106. ఓం నిత్యయౌవన మంగళ్యమంగళాయై నమః
107. ఓం మహాదేవ సమాయుక్తశరీరాయై నమః
108. ఓం మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై. నమః
||శ్రీ లలితా
అష్టోత్తర శతనామావళి సంపూర్ణం||
Ashtottaras
No comments:
Post a Comment