Thursday 24 August 2017

Pujalu Nomulu Vratalu :Vinayaka Chavithi Pooja Vidhanam In Telugu

       Vinayaka Chavithi Pooja Vidhanam In Telugu 

Vinayaka Chavithi Pooja Vidhanam In Telugu pujalu nomulu vratalu
                                      
                                            Vinayaka Chavithi Pooja in Telugu

వినాయక  చవితి పూజకు కావలసిన వస్తువులు
పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)
పాలవెల్లి(అలంకారముతొ)
బియ్యం  అరకిలొ
తమలపాకులు 25
అగరవత్తులు  1 ప్యాకట్
బెల్లం 50 గ్రా, కొబ్బరికాయ
హారతి కర్పూరం
ప్రత్తి(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)
దీపము(ఆవునెయ్యి లేదా కొబ్బరి నూనె)
పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు,
                                    వినాయక చవితి పూజ చేసే విధానం
పార్థివ ప్రతి మా ప్రాశస్త్యము:
వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా??  రంగుది వాడవలెనుఇవి అనేకుల ప్రశ్నలుదీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లో: పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి
పురుషుడు గానిస్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్రపశ్వాది సమస్త సంపదలను పొందగలరు.
 ప్రతిమ ఎట్టిమతో చేయవలెను?
మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం
శుభ్రం అయినదిమెత్తనిదిరాళ్ళుఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి  ప్రతిమచేయవలెను
శ్లో. కృత్వా చారుతరాం మూర్తిం  ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెనుఅయితే ఇది అందరికి సాధ్యం కానిదిప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారుఅట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.
దూర్వాయుగ్మ పూజ:
వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలుదూర్వలు అనగా గరిక పోచలు.  గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును.  చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్నబంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి.  గణేశుడే స్వయంగా మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినా“ అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయిననుచిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.
వినా దూర్వాంకు రైపూజా ఫలంకేనాపి నాప్యతే
తస్మాదుషసి మద్భ  త్కై రేకా వాప్యేక వింశతి:
భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్
నతత్క్ర్ తుశతై  ర్దా నైర్వ తానుష్టాన సంచయై :
వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను.  పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను.  చిన్నపళ్ళెములో బియ్యం పోసి  బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెనుఆకు కొన తూర్పునకు ఉండవలెను.  ఆవు నేతితో గానినూనెతో గాని దీపము వెలిగించిగణపతికి నమస్కరించి  విధముగా చదువ వలెను.
శ్రీ మహాగణాధిపతయే నమశ్రీ గురుభ్యోనమహరిఓం
శ్లోశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం   ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
మం.  ఓం  దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.
ఆచమనం:
పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసుతో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను.  బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా :
( మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.) ఓం  విష్ణవే నమ:,ఓం త్రివిక్రమాయ నమ:,,ఓం వామనాయ నమ:,ఓం శ్రీధరాయ నమ:,ఓం హ్రుషీకేశవాయ నమ:,ఓం పద్మనాభాయ నమ:,ఓం దామోదరాయ నమ:ఓం సంకర్షణాయ నమఓం వాసుదేవయ నమఓం ప్రద్యుమ్నాయ నమఓం పురుషోత్తమాయ నమఓం అధోక్షోజాయ నమఓం అచ్యుతాయ నమఓం జనార్థనాయ నమఓం హరయే నమఓం శ్రీ కృష్ణాయ నమ:
దైవ ప్రార్థన:
 (గణపతికి నమస్కరించి  క్రింది శ్లోకములు చదువ వలెను.
శ్లో: యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవయేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన:
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ:  ఉమా మహేశ్వరాభ్యాం నమశచీ పురంధరాయ నమఅరుంధతీ వశిష్టాభ్యాం నమశ్రీ సీతారామాభ్యాం నమసర్వేభ్యో మహాజనేభ్యో నమ:
భూతోచ్చాటన:(క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో:  ఉత్తిష్టంతు భూతపిశాచాఏతే భూమి భారకాఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
తాభూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట.  చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.
ప్రాణాయామము:ఓం భూ:  ఓం భువ:  ఓం సువ:  ఓం మహ:  ఓం జన:  ఓం తప:  ఓం సత్యం  ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోనప్రచోదయాత్  ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం
(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చిఓం భూనుండి  భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను.  దీనినే పూరకంకుంభకంరేచకం అందురుమంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు.  బ్రహ్మచారులు బొటన వ్రేలుచిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
సంకల్పము:(ఎప్పుడుఎక్కడఎవరుఏమి కోరి, పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తేశ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణద్వితీయపరార్ధేశ్వేతవరాహకల్పేవైవస్వత మన్వంతరే,కలియుగేప్రధమపాదేజంబూ ద్వీపేభరతవర్షేభరతఖండేమేరోర్ధక్షిణదిగ్భాగేశ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరేదక్షిణాయనేవర్షఋతౌభాద్రపదమాసే,శుక్లపక్షేచతుర్థ్యాం ………………. వాసరే,శుభ నక్షత్రేశుభయోగే శుభకరణేఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర……….నామధేయధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధంధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధంపుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధంశ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే(నీరు ముట్టుకొనవలెను.)
కలశారాధనం:(కలశం అనగా పూజ చేయుటకు నీరు తీసుకున్న పాత్రఆచమనము చేయుటకు పెట్టుకున్న నీటిపాత్రను కలశారాధనకు వాడరాదు.వేరేపాత్రలో నీటిని పోసి  పాత్రచుట్టూ మూడుచోట్ల గంధముకుంకుమఅక్షతలు అద్ది ఆనీటిలో గంధమునుపుష్పములనుఅక్షతలను ఉంచితే అదే కలశముదానిపై చేతిని ఉంచి  క్రింది విధముగా చదువవలెను.
శ్లోకలశస్య ముఖే విష్ణుకంటే రుద్ర స్సమాశ్రితమూలే తత్ర స్థితోబ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతా:
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరాఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణ:
అంగై శ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాకలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్యహస్తే నాచ్చాద్య.
మంఆదల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్ధైర్యజ్ణేషు వర్ధతేఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతా న్యాపప్రాణావా ఆపపశవ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపోవిరాడాపస్స్వరాడాపశ్చందాగ్ స్యాపో జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాపస్సర్వా  దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం.
గంగేచ యమునేకృష్ణె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురుఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్ధం మమ దురితక్షయకారకాకలశోదకేన దేవంఆత్మానంపూజా ద్రవ్యాణి  సంప్రోక్ష్య. (కలశములోని నీరు పుష్పముతో గణపతి పైనపూజాద్రవ్యములపైన చల్లవలెను.

గణపతి పూజ ప్రాణ ప్రతిష్ట
(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ  క్రింది విధముగా చదువ వలెను.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం
అసునీతే పునరస్మాను చక్షుపునప్రాణమినహనోదేహి భోగం
జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి
అమృతంవై ప్రాణామృతమాప:ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే.
శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతిం ఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవవరదోభవసుప్రసన్నోభవస్థిరాసనం కురుగణపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.
షోడశోపచార పూజ:(క్రింది విధముగా ఒక్కొక్క ఉపచారము చెప్పి గణపతికి అక్షతలు సమర్పించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమధ్యానం సమర్పయామి,  ఆవాహయామి,  రత్నసింహాసనం సమర్పయామి
(క్రింది విధముగ చదువుతు కలశములోని నీరు పుష్పముతో గణపతిపై చల్లవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమపాదయో పాద్యం సమర్పయామి,  హస్తయో అర్ఘ్యం సమర్పయామి,  ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం  సమర్పయామి  స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.  అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వారత్మకశ్రీ  మహాగణాధిపతయో నమవస్త్రయుగ్మం సమర్పయామి  శ్రీ మహాగణాధిపతయే నమయజ్ణోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమదివ్యశ్రీ చందనం సమర్పయామి  శ్రీ మహాగణాధిపతయే నమఅలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
( క్రింది నామములు చదువుతూ గణపతికి పుష్పములు గానిఅక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను.)
ఓం సుముఖాయ నమ:  ఓం ఏకదంతాయ నమ:  ఓం కపిలాయ నమ:  ఓం గజకర్ణాయ నమ:  ఓం లంబోదరాయ నమ:  ఓం వికటాయ నమఓం విఘ్నరాజాయ నమ:  ఓం గణాధిపతయే నమ:  ఓం ధూమకేతవే నమఓం గణాధ్యక్షాయ నమ:  ఓం పాలచంద్రాయ నమ:  ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ:  ఓం శూర్పకర్ణాయ నమ:  ఓం హేరంబాయ నమ:  ఓం స్కందపూర్వజాయ నమ:  ఓం సర్వసిద్ధి ప్రదాయ నమఓం మహాగణాధిపతయే నమషోడశ నామభిపూజాం సమర్పయామి.
(అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమధూపమాఘ్రాపయామి.
(దీపమునకు నమస్కరించవలెను.)
దీపం దర్శయామి. :ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి
నైవేద్యం సమర్పయామి.:(బెల్లముపై నీరు చల్లిచుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.)
ఓం భూర్భువస్సువ:  తత్సవితుర్వరేణ్యం  భర్గో దేవస్యధీమహి ధియోయోనప్రచోదయాత్సత్యంత్వర్తేన పరిషించామి.
శ్రీ మహాగణాధిపతయే నమఅవసరార్ధం గుడోపహారం నివేదయామి అమృతమస్తు  అమృతోపస్తరణమసి  ఓం ప్రాణాయ స్వాహా,  ఓం అపానాయ స్వాహాఓం వ్యానాయ స్వాహా,  ఓం ఉదానాయ స్వాహా,  ఓం సమానాయ స్వాహా (క్రిందివిధముగా చదివి కలశములోని నీరు వదలవలెను.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  ఉత్తరాపోశనం సమర్పయామిహస్తౌ ప్రక్షాళయామిపాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం  సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమతాంబూలం సమర్పయామి.
(కర్పూరం వెలిగించి గంట మ్రోగించుచూ క్రింది విధముగా చదివి హారతి యివ్వవలెను.)
శ్రీ మహాగణాధిపతయే నమఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే తయామాసగ్ం సృజామసి సంతత  శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతునిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతుశ్రీ మహాగణాధిపతయే నమకర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం శుద్ద ఆచమనీయమ్ సమర్పయామి.(పళ్ళెములో నీరు వదలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.తరువాత క్రిందివిధముగా ఉపచారములు చెబుతూ అక్షతలు సమర్పించవలెను.)
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ్ నమస్కారాన్ సమర్పయామి.  గణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో బవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుశ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.  (పూజ చేసిన అక్షతలుపుష్పములు శిరస్సున ధరించవలెను.)
శ్లోఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక.
ఉద్వాసన:మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవాతాని ధర్మాణి ప్రధమాన్యాసన్తేహనాకం మహిమానస్సచంతే,యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:
శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామిశోభనార్ధం పునరాగమనాయచ.
(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)
                   (పసుపు గణపతి పూజ సమాప్తం)
                      హరిఓం తత్సత్.
శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము:పాలవెల్లిని పండ్లుపుష్పములుమామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గానిపీటను గాని పసుపు పూసికుంకుమవరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు.  ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.
శ్లోఓం శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ:
ఆచమనం:ఓం కేశవాయస్వాహాఓం నారాయణాయ స్వాహా,  ఓం మాధవాయ స్వాహా,ఓం గోవిందాయ నమ:
విష్ణోమధుసూదనత్రివిక్రమవామనశ్రీధరహృషీకేశప్రద్యుమ్నఅనిరుద్ధపురుషోత్తమఅధోక్షజనారసింహఅచ్యుతజనార్దనఉపేంద్రహరేశ్రీ కృష్ణాయ నమ:
భూతోఛ్ఛాటన:శ్లోఉత్తిష్టంతు భూతవిశాచాఏతే భూమిభారకాఏతేషామవిరోధేనబ్రహ్మకర్మ సమారధే.
ప్రాణాయామము:మంఓం భూ:,  ఓంభువ:,  ఓగ్ం సువ:,  ఓం మహ:,  ఓంజన:  ఓంతప:,  ఓగ్ం సత్యంఓంతత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహిధియో యోనప్రచోదయాత్ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం.
సంకల్పము:
మమ ఉపాత్తదుతితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తేశ్రీ మహావిష్ణోరాజ్ణయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణద్వితీయపరార్ధేశ్వేతవరాహకల్పేవైవస్వతమన్వంతరేకలియుగేప్రధమపాదేజంబూద్వీపేభరతవర్షేభరతఖండే,మేరోర్దక్షిణదిగ్భాగేశ్రీ శైలస్య ఈశాన్యప్రదేశే,
గంగా గోదావర్యోర్మధ్యదేశేశోభనగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరేదక్షిణాయనేభాద్రపదమాసేశుక్లపక్షేచతుర్ధ్యాం ——–వాసరే,శుభనక్షత్రేశుభయోగేశుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ ——–గోత్ర:ధర్మపత్నీ సమేతస్య,  అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య,ధైర్య,విజయ,అభయ,ఆయురారోగ్యఐశ్వర్యాభివృద్ధ్యర్ధంధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధసిద్ధ్యర్ధం,
పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధంసకల కార్వేషు సర్వదాదిగ్వజయ సిద్ధ్యర్ధంఇష్టకామ్యార్ధ ఫలసిద్ధ్యర్ధం,వర్షే వర్షే ప్రయుక్త స్రీ వరసిద్ది వినాయక దేవతాముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయకదేవతాప్రీత్యర్ధంసంభవద్భిఅంకైసంభవద్భి:ఉపచారై:,సంభవతానియమేనపురుషసూక్త విధానేన, కల్పోక్తప్రకారేణధ్యాన ఆవాహనాది  షోడచోపచార పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను.)
వరసిద్ధి వినాయక ప్రతిమాశోధనం కరిష్యే:
(వినాయక ప్రతిమను పంచామృతములచే శుద్ధి చేయవలెను.  పంచామృతములు అంటే ఆవుపాలుపెరుగునెయ్యితేనెపంచదార కలిపిన నీరువీనిలో ఒక్కొక్క ద్రవ్యముతో ప్రతిమను శుద్ధి చేయుచూ చదువ వలసిన మంత్రములు ఇవ్వబడినవి.  మంత్రము చదువుచు కొంచెము కొంచెముగా పంచామృతములు పుష్పముతో ప్రతిమపై చల్లవలెను.  పంచామృతములు లభింపనిచో కొబ్బరినీటితో ప్రతిమా శోధనం చేయవచ్చును.)
పాలు: మం:ఆప్యాయస్వసమేతుతేవిశ్వత స్సోమవృష్ణియంభవా వాజస్య సంగధే
పెరుగు: మం:దధిక్రావ్ణ్ణోఅకారిషంజిష్ణోరశ్వస్యవాజిన:సురభినోముఖాకరత్ప్రణ ఆయుగ్ంషితారిషత్
నెయ్యిమం:శుక్రమసి జ్యోతిరసి తేజోపిదేవోవస్సవితోత్పునాత్వచ్ఛిధ్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:,
తేనెమం:మధు వతఋతాయతేమధుక్షరంతి సింధవమాధ్వీర్నస్సంత్వోషధీ:మధుసక్తముతో షసిమధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్య:మాధ్వీర్గావో భవంతున:
పంచదార:మంస్వాదుపవస్వ దివ్యాయ జన్మనేస్వాదురింద్రాయసుహ వేతునామ్నేస్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవేబృహస్పతయే మధుమాగ్ం అదాభ్య:
ఉదకము:మం:  ఆపోహిష్టామయోభువతానఊర్జేదధాతనమహేరణాయ చక్షసేయోవశ్శివతమోరసతస్యభాజయతే హన:ఉశతీరివ మాతర:తస్మా అరంగ మామవయస్యక్షయాయ జిన్వధఆపోజనయధాచన:    
ప్రాణప్రతిష్ట:(పుష్పములుఅక్షతలు తీసుకొని నమస్కరించి  విధముగా చదువ వలెను.)
మం: తత్పురుషాయ విద్మ్హహే మహాదేవాయ ధీమహితన్నో దంతిప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక మావాహయామి స్థాపయామి పూజయామి     
(పుష్పములు అక్షతలు వినాయకునిపై ఉంచవలెనుతరువాత పుష్పమతో వినాయకువి తాకుతూ  క్రింది విధముగాచదివి పుష్పమును వినాయకుని వద్ద ఉంచవలెను.)
మం:  అసునీతే పునరస్మాను చక్షుపునప్రాణమిహనోధేహి భోగంజ్యోక్పశ్యేమ సూర్య మచ్చరంతమనుమతేమృడయాన స్స్వస్తిఅమృతం వై ప్రాణా:అమృతమాపప్రాణానేవ ధాస్థానముపహ్వయతేశ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు.
ధ్యానం:(పుష్పములుఅక్షతలు తీసుకొని నమస్కరించి  క్రింది విధముగా చదివి వినాయకునిపై ఉంచవలెను.)
శ్లో: భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతంవిఘ్నరాజ మహం భజే.
ఏకదంతం శూర్పకర్ణంగజవక్త్రం చతుర్భుజం –  పాశాంకుశధరం దేవంద్యాయేత్సిద్ధి వినాయకం.
ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం  –  భక్తాభీష్టప్రదంతస్మాత్ధ్యాయేత్తం విఘ్ననాయకం.
ధ్యాయేద్గజాననం దేవంతప్తకాంచన సన్నిభం –  చతుర్భుజం మహాకాయంసర్వాభరణ భూషితం.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహనం:మం:సహస్రశీర్షా పురుష:సహస్రాక్ష స్సహస్రపాత్,సభూమిం విశ్వతో వృత్వాఅత్యతిష్టద్దశాంగులం.
శ్లోఅత్రాగఛ్ఛ జగద్వంద్యసుర రాజార్చితేశ్వరఅనాధ నాధసర్వజ్ఞగౌరీ గర్భ సముద్భవ.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమఆవాహయామి. 
రత్నసింహాసనం:(పుష్పములుఅక్షతలు తీసుకొని నమస్కరించి  విధముగా చదివి వినాయకునికి సమర్పింవవలెను.)
మం:పురుష  వేదగ్ం సర్వంయద్భూతం యచ్చభవ్యంఉతామృతత్వ శ్యేశానయదన్నే నాతి రోహతి
శ్లో: మౌక్తికైపుష్యరాగైశ్చనానారత్న విరాజితం రత్నసింహసనం చారుప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమరత్నసింహాసనం సమర్పయామి.
పాద్యం:మం:  ఏతావానశ్యమహిమాఅతోజ్యాయాగ్ శ్చపూరుషపాదోస్యవిశ్వాభూతానిత్రిపాదస్యామృతం దివి.
శ్లోగజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయకభక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమపాదయో పాద్యం సమర్పయామి. (పుష్పముతో వినాయకుని పాదములపై నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:మం:  త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:,పాదోస్యేహాభవాత్పున:  తదోవిష్వజగ్వ్యక్రామత్సాశనానశనే అభి 
శ్లో:  గౌరీపుత్ర నమస్తేస్తుశంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తంగధపుష్పాక్ష తైర్యుతం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమహస్తయోఅర్ఘ్యం సమర్పయామి. (నీరు విడువవలెను.)
ఆచమనీయం:మం:  తస్మా ద్విరాడజాయతవిరాజో అధిపూరుషసజాతో అత్యరివ్యతపశ్చాద్భూమి మధోపుర:
శ్లో:  అనాధ నాధ సర్వజ్ఞగీర్వాణ పరిపూజితగృహాణాచమనందేవతుభ్యం దత్తంమయాప్రభో
శ్లో:  శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమముఖే ఆచమనీయం సమర్పయామి. ( వినాయకునిపై పుష్పముతో నీరు చల్లవలెను.)
పంచామృత స్నానం:(క్రింది విధముగా చదువుచూ పాలుపెరుగునెయ్యితేనెపంచదార నీరు పుష్పముతో వినాయకునిపై చల్లవలెను):
మం: యత్పురుషేణ హవిషాదేవాయజ్ఞ మతన్వత
    వసన్తో అస్యాసి దాజ్యంగ్రీష్మ ఇధ్శశ్శ్రరద్ధివి:
శ్లో: దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
  మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే
స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
పయోదధి ఘృతైర్యుక్తం శర్కరామధు సంయుతం
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం:
శ్లో:గంగాది సర్వతీర్ధేభ్యఅమృతైరమలైర్జలై:
  స్నానం కురిష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే :
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
శుద్దోదక స్నానంసమర్పయామి.( పుషముతో నీరు వినాయకుని పపై చల్లవలెను)
వస్రం:మం:సప్తాస్యాసన్ పరిధయత్రిస్సప్త సమధక్రతా:
   దేవాయద్య్హజ్ఞం తన్వానాఅబధ్యన్ పురుషపశుం
శ్లో:రక్తవస్ర్తద్వయంచారు దేవయేగ్యం  మంగళం
  శుభప్రధం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమవస్ర్తయుగ్మం సమర్పయామి.( పత్తిని ఉండలుగాచేసి తడిపి పసుపు అద్ది వస్ర్తముగా సమర్పించుట ఆచారముఅట్టివి 2 వస్ర్తములు సమర్పించవలెను).
యజ్ఞోపవీతము
మం:తంయజ్ఞం బర్హిప్రౌక్షన్ పురుషం జాతమగ్రత:
   తేన దేవాఅయజంత సాధాఋషయశ్చయే
శ్లొ:రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం
  గృహాణ సర్వధర్మజ్ఞభక్తానామిష్టదాయకం
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ:యజ్ఞోపవీతము సమర్పయామి ( ప్రత్తిని చేతితో కోంచెము మేర నూలువలె తీసి అక్కడ పసుపు అద్ది యజ్ఞోపవీతముగా సమర్పించవలెను).
గంధం:
మం:తస్మాద్యజ్ఞాత్సర్వహుత:సంభృతం పృషదాజ్యం
    పశూగౌస్తాగౌశ్చత్రేవాయవ్యాన్ఆరణ్యాన్ గ్రామశ్చయే
శ్లో: చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం
   విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతం
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమదివ్యశ్రీ చందనం సమర్పయామి.( వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.)
ఆభరణం:
మం:తస్మాద్యజ్ఞాత్సర్వహుతఋచస్సామానీజిజ్ఞిరే
   ఛందాగం సి జిజ్ఞిరేతస్సాత్ యజుస్తస్మాదజాయతే
శ్లో: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్
   శుభాన్గృహాణ పరమానంద ఈశుపుత్రనమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ:  అలంకరణార్దాం అక్షతాన్ సమర్పయామి.   (అలంకరణార్దాం అక్షతలు సమర్పింపవలెను)
పుష్పాణి:
మం:తస్మాదశ్వాఅజాయంత ఏక్ చోభయాదత:
    గావోహా జిజ్ఞిరే తస్మాత్తస్మాజ్జాతా అజావయ:
శ్లో: సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ
  ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే
శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమపుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)
అధాంగపూజ:(ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)
ఓం గణేశాయనమపాదౌ పూజయామి.(పాదములు)
ఓం ఏకదంతాయనమగుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయనమజానునీ పూజయామి. (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయనమజంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ:  కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమఉదరం పూజయామి. (కడుపు)
ఓం గణనాధాయనమనాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమహృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమకంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమస్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమహస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమవక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమనేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమకర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమలలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమశిరపూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమసర్వాంగాని పూజయామి.
ఏకవింశతి పూజ: (వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచేపూజింపవలెనుసంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.
ఓం సుముఖాయనమ:  మాచీపత్రం సమర్పయామి  (మాచి పత్రి)
ఓం గణాధిపాయ నమ:  బృహతీ పత్రం సమర్పయామి  (వాకుడు)
ఓం ఉమా పుత్రాయ నమ:  బిల్వపత్రం సమర్పయామి  (మారేడు)
ఓం  గజాననాయనమ:  దూర్వాయుగ్మం సమర్పయామి (రెండు గరికలు)
ఓం హరసూనవే నమ:  దత్తూర పత్రం సమర్పయామి  (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమ:  బదరీ పత్రం సమర్పయామి  (రేగు)
ఓం గుహాగ్రజాయనమ:  అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయనమ:  తులసీ పత్రం సమర్పయామి (తులసి)
ఓం ఏకదంతాయనమ:  చూతపత్రం సమర్పయామి (మామిడి)
ఓం వికటాయనమ:  కరవీర పత్రం సమర్పయామి  (గన్నేరు)
ఓం భిన్నదంతాయనమ:  విష్ణుక్రాంత పత్రం సమర్పయామి  (విష్ణుక్రాంతి)
ఓం వటవే నమ:  దాడిమీ పత్రం సమర్పయామి  (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమదేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమమరువక పత్రం సమర్పయామి (మరువం)
ఓం హేరంబాయ నమసింధువార పత్రం సమర్పయామి (వావిలి)
ఓంశూర్పకర్ణాయనమజాజీపత్రం సమర్పయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమ:  గండకీ పత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమశమీ పత్రం సమర్పయామి (జమ్మి)
ఓంవినాయకాయ నమఅశ్వత్థ పత్రం సమర్పయామి (రావి)
ఓం సురసేవితాయ నమఅర్జున పత్రం సమర్పయామి (మద్ది)
ఓం కపిలాయ నమఅర్క పత్రం సమర్పయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమఏక వింశతి పత్రాణి పూజయామి
శ్రీ విఘ్నేశ్వర అష్టోతర శతనామావళి
1. ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
దూర్వాయుగ్మ పూజ:(21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)
ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ధూపం:మం: యత్పురుషం వ్యదధు: కతిధావ్యకల్పయన్ముఖం కిమస్య కౌబాహూకావూరూ పాదా ఉచ్యేతే
శ్లో: వనస్పతిరసై ర్దివ్యై ర్నానాగన్ధై స్సుసంయుతమ్– ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం – ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: ధూపమాఘ్రాపయామి.(అగరవత్తులు వెలిగించి వినాయకునికి ధూపము చూపించవలెను.)
దీపం:మం:  బ్రాహ్మణోస్య ముఖమాసీత్బాహూరాజన్య: కృత: ఊరూతదస్య యద్వైశ్య: పద్భ్యాగ్ం శూద్రో అజాయత
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తంవహ్ని నాయోజితం ప్రియంగృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: దీపం దర్శయామి(దీపమునకు నమస్కరించి వినావకునికు చూపించవలెను.)
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.(నీరువదలవలెను.)
నైవేద్యం:
మం: చంద్రమా మనసోజాత: చక్షోస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ పాణాద్వాయురజాయత
శ్లో: సుగన్ధా స్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్నైవేద్యం గృహ్యతాందేవ చణముద్గై: ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.
(ఒక పళ్ళెములో పళ్ళుపాలునీళ్ళతో పాటు చేసిన పిండి వంటలువంటలు కొంచెంకొంచెము ఉంచినీళ్ళు చల్లుతూ తర్వాత పళ్ళెము చుట్టూ నీరు త్రిప్పుచూ వినాయకునికి నైవేద్యం చూపించవలెను.)
ఓం భూర్భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియో యోన: ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కల్పోక్త నైవేద్యం సమర్పయామి.
ఓం ప్రాణాయ స్వాహా  ఓం అపానాయ స్వాహా  ఓం వ్యానాయస్వాహా  ఓం ఉదానాయ స్వాహా  ఓం సమానాయ స్వాహా  మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అమృతాపి ధానమసిఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామిపాదౌ ప్రక్షాళయామిశుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(3సార్లు కొంచెం కొంచెం నీరు వదలవలెను.)
తాంబూలం:మం: నాభ్యా ఆసీదన్తరిక్షమ్  శీర్ష్ణో ద్యౌస్సమవర్తత  పద్భ్యాగ్ం భూమిర్దిశశ్రోత్రాత్  తధాలోకాగ్ం అకల్పయన్
శ్లో: పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం  ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
(5తమలపాకులు, 2వక్కలు వినాయకుని వద్ద ఉంచి నమస్కరించవలెను.
రాజనం: (కర్పూరం వెలిగించి  క్రింది విధముగా చదువుతూ గంటమ్రోగించవలెను.)
మం: వేదాహమేతం పురుషం మహాంతంఆదిత్యవర్ణం తమసస్తుపారేసర్వాణి రూపాణి విచిత్య ధీర: నామాని కృత్వా అభివదన్ యదాస్తే
సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖేతయామాసగ్ం సృజామ: సంతతశ్రీరస్త్రుసమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్త్రు నిత్యమంగళానిభవంతు
శ్లో: ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా నీరాజనం మయాదత్త గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.
(పళ్ళెములో నీరు వదలవలెను.)
మంత్రపుష్పం  (చేతిలో పువ్వులుఅక్షతలు తీసుకుని క్రింది విధముగా చదువుతూ నమస్కరించవలెను.)
మం: ధాతా పురస్తాద్యముదాజహారశక్ర:ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర: తమేవం విద్వానమృత ఇహ భవతినాన్య: పంధా అయనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం వశ్వశంభువం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.
  (అక్షతలుపుష్పములు వినాయకుని పాదములపై ఉంచవలెను.)
పునరర్ఘ్యం:
శ్లో: అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్ద్గం పాపనాశన.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: పునరర్ఘ్యం సమర్పయామి. (నీరు వదలవలెను.)
ఆత్మప్రదక్షిణ:
(అక్షతలుపువ్వులు తీసుకుని కుడిచేతిమీదుగా తమచుట్టూ తాము తిరుగుతూ ఈక్రింది విధముగా చదువవలెను)
శ్లో: యానికానిచపాపాని జన్మాంతర కృతానిచతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపాహం పాప కర్మాణా పాపాత్మా పాప సంభవ:
అన్యధశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. (అక్షతలుపువ్వులు వినాయకుని పాదముల చెంత ఉంచవలెను.)
సాష్టాంగం:మం: ఉరసా శిరసా దృష్ట్యామనసా వచసాతధా  పద్భ్యా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే.
        శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: సాష్టాంగ నమస్కారం సమర్పయామి.
(సాష్టాంగ నమస్కారం అనగా ఎనిమిది అంగములతో చేయు నమస్కారము. అనగా 1.వక్షము 2.శిరస్సు 3. కండ్లు  4. మనస్సు5. వాక్కు  6. పాదములు 7.చేతులు  8. చెవులు. పురుషులు మాత్రమే పూర్తిగా సాగిలపడిచేయవలను.)
రాజోపచారములు: ఛత్రం సమర్పయామిచామరంవీచయామినృత్యం దర్శయామిగీతం శ్రావయామిదర్పణం దర్శయామి,అశ్వానారోహయామి,గజానారోహయామిరధానారోహయామి,ఆందోళికాది సమస్త రాజోపచారభక్త్యోపచారశక్త్యోపచార పూజాన్ మనసా సమర్పయామి. (పుష్పములను సమర్పించవలెను.)
శ్లో: యస్య స్మృత్యాచ నమోక్త్యా తప: పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే వివాయక.
మంత్రహీనంక్రియాహీనంభక్తిహీనం వినాయక యత్పూజితం మయాదేవపరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయాంచ,భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక దేవతా సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు.
అపరాధ క్షమార్పణ:
శ్లో: అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయాదాసోయమితి మాంమత్వాక్షమస్వ పరమేశ్వర.
 ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వర సర్వాపరాధాన్ క్షమధ్వం
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాప్రసాదం శిరసా గృహ్ణామి.(పూజ చేసిన పుష్పములుఅక్షతలు తీసుకొని శిరస్సున ధరించవలెను.)
                                      వ్రతం సువ్రతమస్తు
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు.
ఉద్వాసన మంత్రం:  (వినాయక ప్రతిమ ఉంచిన పీటను చేతితో పట్టుకొని క్రింది మంత్రము చదువ వలెను.)
మం: యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా  తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహినానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా: శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: యధాస్థానముద్వాసయామి.
                               హరి: ఓం తత్సత్  బ్రహ్మార్పణమస్తు
                        (ఇంతటితో వినాయకుని పూజావిధానము పూర్తి అయినది.)
                                       శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ
(అక్షతలు చేతిలో తీసుకొని కధ చదువవలెను.)
శూతుడు అను ఋషి శౌనకాది మునులకు వరసిద్ధివినాయక వ్రతమును గురించి చెప్పెను.
వినాయకుడు అనగా దుష్టులనువిఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్ధము. ఇతడు విద్యాధిదైవతము గానువ్రాయుట అను పద్ధతిని ఆరంభించిని దైవము గాను పూజింపబడు చున్నాడు.

విఘ్నేశ్వరుని పుట్టుక:   
పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరితను అజేయుడుగాఎవరూ వధింపరాని విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమునందు నివసించాలని వరము పొందినాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్ధింపగా,నందీశ్వరుని గంగిరెద్దుగాతాను గందిరెద్దును ఆడించేవానిగా వేషము ధరించి,గంగిరెద్దును గజాసురుని ఎదుట చిత్రవిచిత్రముగా ఆడించి  అసురుని మెప్పించిఆఅసురుని ఉదరకుహరమందున్న పరమశివుని కోరినాడు.  అంత విష్ణుమాయను గ్రహించి,తనకు చేటుకాలము దాపురించిందని తలచిశివుని ఉద్దేశించిగజాసురుడు  ” ప్రభూ! శ్రీ హరి ప్రభావముచే నాజీవితకాలము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లునాచర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము నిమ్మని తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి శివునకు తన ఉదరకుహరమునుండి విముక్తిని ప్రసాదించినాడు.  చాలాకాలమునకు శివుడు తిరిగి కైలాసమునకు వచ్చుచున్నాడన్న శుభవార్త తెలిసిన పార్వతీదేవి సర్వాలంకారభూషితురాలై భర్తను స్వాగతింపదలచిఅభ్యంగనస్నాన
మాచరించుటకుసిద్ధమైనలుగుపిండితో ఒక బాలునిబొమ్మను చేసిదానికి ప్రాణప్రతిష్ట చేసి,లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచెనుఅంత సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరుని గాంచిన  బాలుడు అభ్యంతరమందిరమందు నిలువరించగాపరమేశ్వరుడు ఆగ్రహము పట్టలేక  బాలుని శిరమును ఖండించి మందిరము లోనికి ఏగినాడు. మాటలసందర్భంలో బాలుని ప్రసక్తి రాగా జరిగిన ఘోరముతెలుసుకొన్న పార్వతీదేవిని శివుడు ఓదార్చిఉత్తరదిశగా తలపెట్టి నిద్రించుచున్న ప్రాణి తలను తెచ్చి  కుర్రవాని మొండెమునకు అతికింపుమని తన పరివారమునకు ఆదేశించెను. వారు ఉత్తరముగా పరుండిన ఒక ఏనుగు తలను తిచ్చి ఆబాలుని మొండెమునకు
అతికించిరి. అప్పుడు శివుడు ప్ర్రాణప్రతిష్ట చేయగా ఆబాలుడు గజాననుడైనాడు.  గజాననుడు తల్లిదండ్రులకు భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక మూషికమును వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతిపరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను.  అంత మహేశ్వరుడు కుమారులతో ఇరువురిలో ఎవరు ముల్లోకములందలి
పుణ్యతీర్ధములందు స్నానమాచరించి ముందుగా తనను చేరుదురో వారికి ఆధిపత్యము యిత్తుననెను. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనమునధిరోహించివాయువేగమున బయలువెడలెను. గుజ్జురూపమున నున్న గజాననుడు తన మూషకవాహనంపై తండ్రి పెట్టిన పోటి నెగ్గడం అసాధ్యమని గ్రహించికాస్త ఆలోచించి పోటీ తన గురించి పెట్టినట్లు గ్రహించిగజాననుడు భక్తితో ముమ్మారు తల్లిదండ్రులకు,ప్రదక్షిణ నమస్కారాలాచరించి ప్రణమిల్లాడు. అక్కడ కుమారస్వామి  తీర్ధమునకు పోయిననూ అన్నగారు తనకన్న ముందు ఉండటం చూసిఆశ్చ్రర్యమునొందికైలాసమునకు చేరగానే తల్లిదండ్రులకు ప్రణమిల్లుతున్న అన్నగారిని చూసిజరిగినది తెలుసుకొనితన అహంకారమును నిందించుకొనితండ్రితో అన్నయ్యకే గణాధిపత్యమును ఒసంగమనెను.  మహేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి తిధియందు గజాననునకు విఘ్నాధిపత్యమునొసంగెను.   దినమున గజాననుడు సర్వజనులు భక్తిశ్రద్ధలతో చేసినపూజను గ్రహించికుడుములుఉండ్రాళ్ళు ,పళ్ళు మొదలుగా గల ఎన్నో రకాలు నైవేద్యాలను ఆరగించికైలాసమునకేగితల్లితండ్రులకు పాదాభివందనం చేయడానికి ఎంతో కష్ట పడుతున్న వినాయకుని చూసి పరమశివుని శిరమునందలి చంద్రుడు వికటముగానవ్వెను. అంత రాజదృష్టి శోకిన రాళ్ళు కూడ నుగ్గవునను సామెత ననుసరించివిఘ్నేశ్వరుని ఉదరము పగిలి కుడుములచట ఎల్లెడల ద్రొల్లెను. అంత పార్వతీ దేవి శోకించుచు చంద్రుని చూచి, ” పాపాత్మా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు నీలాపనిందలు పొందుదురుగాక.” అని శపించెను.  సమయమును సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమభార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి.  అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున క్షీణించుచుండ అంతస్వాహాదేవి అరుంధతిరూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములను తానే ధరించిభర్తకు ప్రియమును కలుగచేసెను. అయితే ఋషులు  అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించివారిని పరిత్యజించినారు. పార్వతీదేవి శాపానంతరము చంద్రుని చూచుటవల్లే తమకిట్టి నీలాపనిందలు కలిగెనని గ్రహించివారు బ్రహ్మదేవుని కడకేగిజరిగినది విన్నవించి ప్రార్ధింపగా బ్రహ్మదేవుడు ఋషులతో వారి పత్నుల తప్పు ఏమియు లేదని తెలిపివారితో కూడ బ్రహ్మ కైలాసమునకు ఏతెంచిఉమామహేశ్వరులను సేవించిమృతుడై ఉన్న వినాయకుని బ్రతికించెను. అంత దేవాదులు,” పార్వతీ దేవి! నీవిచ్చిన శాపవశమును లోకములకెల్ల కీడు వాటిల్లెను. కావున దానిని ఉపసంహరింపమని ప్ర్రార్ధింప అంత పార్వతీ దేవి , “ఏనాడు వినాయకుని చూచి చంద్రుడు నవ్వెనో  దినము చంద్రుని చూడరాదు.” అని శాపావకాశము నొసెంగెను. అంత వారందరు వారి గృహమలకేగి భాద్రపద శుద్ధచవితి నాడు చంద్రుని చూడక జాగరూకతతో సుఖముగా నుండిరి.ఇట్లు కొంత కాలము గడిచెను. అందువల్ల అతడు గణపతి అయ్యొను. అటులనే విఘ్నములకు కూడా ఆధిపత్యము ఒసగుటవలను విఘ్నేశ్వరుడైనాడు.  ఆధిపత్యములు స్వీకరించిన రోజు,తాను జన్మించినరోజు భాద్రపద శుద్ధ చవితి కనుక ఆరోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమతమ అభీష్టములు పొందెదరు. శ్యమంతకోపాఖ్యానము: ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్ముని నారదుడుదర్శించి స్తుతించుచు ప్రియసంభాషణ జరుపుచు, ” స్వామీ! సాయంసమయమాయెను. ఈనాడు విఘ్నేశ్వర చతుర్ధి గాన పార్వతీశాపముచే చంద్రుని చూడరాదు. కాన సెలవివ్వవలసింది.” అని నారదుడు వెడలగానే ద్వారకయందు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదు. అనిచాటింపు వేయించెను. ఆనాటి రాత్రి క్షీరప్రియుడగుటచే శ్రీకృష్ణుడు మింటికి చూడకనే గోష్టమునకు పోయి పాలుపిదుకుచు పాలలో చంద్ర ప్రతిబింబము గాంచి, “ఆహా! నాకిక ఎట్టి ఆపద రానున్నదో” అని సంశయించెను.
వృష్ణి వంశీయుడగు నిమ్నుడను వానికి ప్రసేనుడుసత్రాజిత్తు అను యిరువురు కొడుకులు ఉండెడివారు. సత్రాజిత్తు సూర్యదేవుని ఆరాధించి,సూర్యుని  మెప్పించి,అత్యంత ప్రకాశవంతమైన రోజుకి ఎనిమిది బారువుల బంగారము నిచ్చునట్టి శ్యమంతకమణి అను ఒక దివ్యమైన మణిని వరంగా పొందెను. మణిని తీసుకుని శ్రీకృష్ణదర్శనార్ధము ద్వారకకు విచ్చేసిన సత్రాజిత్తు ద్వారా మణి మహిమను తెలుసుకున్న శ్రీకృష్ణుడు  మణిని ద్వారకను పాలిస్తున్న ఉగ్రసేన మహారాజుకు కానుకగా యిమ్మనెను. సత్రాజిత్తు అందుకు నిరాకరించెను. కొంతకాలమునకు ప్రసేనుడు అశుచిగా ఉండి మణిని ధరించి వేటకు వెడలెను.మహామహిమాన్వితమైన ఆమణిని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయము వాటిల్లగలదు. ఒక సింహము అది ఒక మాంసఖండముని భ్రమసి ప్రసేనుని చంపి  మణిని గ్రహింపగా జాంబవంతుడను భల్లూకరాజు సింహమును చంపి  మణిని తీసుకొనిపోయి తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా యిచ్చెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త విని,  “శ్రీకృష్ణుడు మణినీయనందులకు తనసోదరుని చంపి మణిని అపహరించెను”. అని చాటించెను. అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శనదోషంబని తలచి దానిని నివారించుకొనుటకు తనపరివారముతో అరణ్యమునకు బయలుదేరి  ప్రసేనుని జాడలుఅతనిని చంపిన సింహపు జాడలు,జాంబవంతుని అడుగుల జాడలు అనుసరించి జాంబవంతుని గుహకు చేరి మణిని తీయునంతలో  జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడెను.  యుద్ధము అతిభయంకరముగా ఇరువది ఎనిమిది రోజులు సాగెను. మహాపరాక్రమవంతుడగు జాంబవంతుడు తన బలము  క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి శమంతకమణినితనకుమార్తె అగు జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించెను.  కృష్ణుడు ద్వారకకు చేరి  మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతయు వివరించెను.  సత్రాజిత్తు తను ప్రచారము చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తె అగు సత్యభామను కృష్ణునకు సమర్పించెను.  జాంబవతిసత్యభామలను పరిణయమాడుతున్న శ్రీకృష్ణుని మునులుదేవాదులు భక్తిప్రపత్తుల స్తుతించిశ్రీకృష్ణునితో, ” మీరు సమర్ధులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి. మాకేమి గతి ” అని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు పొరపాటున చంద్ర దర్శనమయిన యెడల ఆనాడు గణపతిని యధావిధిని పూజించి  శ్యమంతకమణి కధను విని అక్షతలు శిరమున దాల్చు వారు నీలాపనిందల నొందకుందురు గాక.” అని ఆనతీయ దేవాదులు సంతసించి తమనివాసములకు పోయి ప్రతి సంవత్సరము అందరు తమ తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ్హ్హ్హ చవితి నాడు గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖముగా నుండిరి. శాపమోక్షప్రకారము వినాయక వ్రతకధను సూతుడు శౌనకాదిమునులకు వినిపించి తన నిజాశ్రమమునకరిగెను.
వినాయక వ్రత మహిమ:
ఈవ్రతమును అన్నికులములవారుస్త్రీపురుషులెల్లరూ చేయవచ్చును. భక్తిశ్రద్ధలతో చేసినచో వినాయకుడు వారివారి ప్రయత్నములను సఫలమొనర్చివిజయము చేకూర్చును.   వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును,దమయంతి నలుని పొందిరి. వృత్రాసురుని చంపినపుడు ఇంద్రుడుసీతను వెదకునపుడు శ్రీరాముడుగంగను భువికి తెచ్చునపుడు భగీరధుడుక్షీర సాగర మధనము చేయనపుడు దేవాసురులుకుష్టు వ్యాధి నివారణకై సోమదేవ మహారాజు  వ్రతము  చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యము తలపెట్టినపుడు వరసిద్ధి వినాయక వ్రతమొనరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు.  వినాయక 
చవితి రోజున చంద్రదర్శనదోషమును పోగొట్టుకొనుటకు  క్రింది శ్లోకము జపించవలెనని ధర్మసింధువునకు ఆదేశము కలదు.
శ్లో:  సింహ: ప్రసేనమవధీత్ సింహా జాంబవతాహతా:  సుకుమారక మారోధీ:  తవహ్యేష శమంతక:
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ సమాప్తము.
స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం  న్యాయేన మార్గేన మహిం మహీశా:   గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.మంగళం మహత్

             (కధారంభమున పట్టుకొనిన అక్షతలు శిరస్సున ధరించవలెను.)

No comments:

Post a Comment