Friday 20 January 2017

Rathasapthami puja vidhanamu - Telugu | Pujalu nomulu vratalu

                Rathaasapthami Puja vidhanamu

Rathaasapthami puja vidhanamu in Telugu,Sri Surya Ashtakam in Telugu,Adityahridayam in English,Rathasapthami katha in Telugu



      Rathaasapthami puja vidhanamu in Telugu

      ప్రతి సంవత్సరంలో మాఘశుక్ల  సప్తమీ పుణ్య దినంలో సూర్యుడు జన్మించాడమే కాకుండా,భూమికి మొట్ట మొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహిచాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజు రథా సప్తమి అంటారు.షష్టి తో కూడిన సప్తమి తిధిద్వయం  కలిసిరావడంవల్ల రథాసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఈ రోజు చేసే పూజలు, వ్రాతాలు దానాలు తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. రథాసప్తమి రోజు ఉదయమే లేచి జిల్లడు ఆకులు లేక చిక్కుడు ఆకులు ,రేగు పండు తలమీద రెండు బుజాల మీద పెట్టు కొని తలస్నానము చేయవలెను.


రథాసప్తమిపూజకు కావలసిన వస్తువులు

ఆవుపాలు
ఆవుపిడకలు
చిక్కుడు ఆకులు
చిక్కుడు పువ్వులు
చిక్కుడు కాయలు
రేగు పండ్లు
పుష్పాలను,కనకబారాలు
కొత్త చిపురుపుల్లలు


      పూజ విధానము: రథసప్తమి రోజు ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల లోపు పూజ చేయాలి. రథసప్తమి రోజున తులసికోట పక్కన సూర్యునికి ఎదురుగా ముగ్గువేసి ఆవుపిడకలతో పొయ్యిల అమర్చుకోవాలి.ఇత్తడి గిన్నెకు పసుపు వ్రాసి కుంకుమ బొట్టుపెట్టి ఆవుపాలు పోసి పిడకల మీదపెట్టవలెను. ఆ పిడకలను కర్పూరంతో వెలిగిచాలి. చిపురుపుల్లకు చిక్కుడు గిజలను గుచ్చిరథం తయారుచేయలి . శ్రీ సూర్య భగవానుడికి ఆవునేతితో రెండు దీపారాధన చేయాలి షోడశోపచారములతో పూజలు గావించి తర్వాత 7 చిక్కుడు ఆకులలో పొంగలి(పరమాన్నం) చలిమిడి,వడపప్పు ఉంచి సూర్యదేవునికి నైవేద్యం నివేదన చేస్తాము. సూర్యఅష్టోత్తరము, సూర్యాష్టకమ్, ఆదిత్య హృదయం, సూర్య సహస్రనామాలు వంటివి పఠించడం వలన ఆర్థికాభివృద్ధి, వంశాభివృద్ధి వంటి శుభఫలితాలుంటాయని, సూర్యాధనవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.


              Rathasapthami katha in Telugu

           
         పూర్వము కాంభోజాన్నిఏలేరాజుకి వృద్ధాప్యం వచ్చేసింది .ఆతనికి కొడుకులున్నారు కాని, వాళ్ళందరూకూడా తలో రకమైన వ్యధితోనూ బాధపడుతున్నారు. వారిలో తన తరువాత రాజయ్యైవారెవరో నిర్ణయించలేక సతమతమవుతుండేవాడు. అలా వుండగా,అ రోజు-తన రాజ్యానికివచ్చిన ఒక బ్రంహ్మాణుని సత్కరించి,కుశల ప్రశ్నలన్నీఅయ్యాక తన కుమారుల గురించి చెప్పి, తనకేదైనా పరిష్కారం చుపించామని ప్రాదేయపడ్డాడు.

   ఆ మీదట బ్రంహ్మాణుడు మహారాజ ! నువ్వు దుఃఖంచాకు సర్వపాపాల్నీ నాశనం చేసేదీ, అన్ని రోగాలను హరించివేసేదీ, ఇష్ట  కామ్యాలను తీర్చేదీ,అష్ట ఐశ్వర్యములాను యిచ్చేదీ,రథసప్తమి అనే ఒక వ్రతంవుంది. ఇది స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చును. నీ కుమారులలో యేగ్యుడైన వాడెవడో ,అతగాడు ముందుగా వ్యాధినుంచి విమోచనం పొంది .రాజకార్యాలలో పాల్గొంటాడు. అతనికే రాజ్యా భిషేకం చెయు. అనంతకాలంలో నీకొడుకులంతా ఆరోగ్య వంతులయి .రాజ భ్రాతలుగా యువ రాజులుగా అతనికి తోడ్పడుతారు”  అని చెప్పాడు.

రాజా విధంగానే రథసప్తమి వ్రతాన్నాచరించి పుత్రులకుఆరోగ్యాన్ని పొందాడు.  

Click here to download


   





No comments:

Post a Comment