Friday 2 December 2016

Sri Saibaba chaalisa in Telugu | Pujalu nomulu vratalu

                   Sri Saibaba chaalisa in Telugu

Sri Saibaba chaalisa in Telugu,Sri Saibaba chaalisa in english



               Sri Saibaba chaalisa in Telugu


షిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నివే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓ సాయి- కరుణించి కాపాడోయి
దరశానమీయగా రావయ్యా – ముక్తికి మార్గం చుపుమయా
షిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నివే ప్రభో

కఫిని వస్త్రము ధరియించి- భుజమునకు జోలి తగిలించి
నింబవృక్షపు చాయలో- ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి- త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం – భక్తుల మదిలో నీ రూపం       ||షిరిడీ||


చాంద్ పాటిల్ కలుసుకొని- ఆతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి- పాటిల్బాధనుతిర్చితివి
వెలిగించావు జ్యోతులను- నీవుపాయోగించి జలమును
అచ్చెరువొందెను ఆగ్రామం – చూసి వింతైన దృశ్యం        ||షిరిడీ||

బాయిజా చేసెను నీ సేవ- ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి- తాత్యాను నీవు బ్రతికించి
పశు పక్షులనుప్రేమిచి- ప్రేమతోవాటినిలాలించి
జీవులపైన మమకారం- చిత్రమయా నీ వ్యవహారం          ||షిరిడీ||


నీద్వారములో నీలచితిని- నిన్నే నిత్యము కొలిచితిమి
అభాయమునిచ్చి బ్రోవుమయా- ఓ షిరిడీశా దయామయా
ధాన్యము ద్వారక ఓమాయా నీలో నిలిచెను శ్రీసాయి
నీధుని మంటల వేడిమికి- పాపము పోవును తాకిడికి      ||షిరిడీ||

ప్రలయకాలమును ఆపితివి- భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనం- కాపాడీ షిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామను బ్రతికించితివి- పాము విషము తొలగించితివి   ||షిరిడీ||

భక్త భీమాజీకి క్షయరోగం- నశియించే అతనిసహనం
ఊదీ వైద్యం చేసావు- వ్యాధిని మాయంచేసావు
కాకాజీకి ఓ సాయి – విఠల  దర్శన మిచ్చితివి
దామూకిచ్చిన సంతానం- కలిగించితివి సంతోషం         ||షిరిడీ||

కరుణాసింధూ కరుణించు- మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము – పెంచుము భక్తీ భావమును
ముస్లిమనుకొని నిను మేఘా- తెలుసుకొని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం- ఇచ్చావయ్య దర్శనము        ||షిరిడీ||

డాక్టరుకు నీవు రామునిగా – బల్వంతుకు శ్రీ దత్తునిగా
నిమోనుకరుకు మరుతిగా – చిదంబరుకు శ్రీ  గణపతిగా
మార్తాండ్కు ఖండోబాగా – గాణుకు సత్యదేవునిగా
నృసింహస్వామిగా జోషికి – దరిశనమిచ్చిన శ్రీసాయి      ||షిరిడీ||

రేయిపగలూ నీ ధ్యానం – నిత్యం నీ లీలపఠనం
భక్తితో చెయ్యండి ధ్యానం -లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు – బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను- కరుణించి నీవు బ్రోచితివి      ||షిరిడీ||

అందరిలోనూ నీ రూపం – నీ మహిమ అతి శక్తిమాయం
 ఓ సాయి మేము ముడులము- ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నేవేనయ మూలం- సాయి మేము సేవకులం
సాయి నామమే తలిచెదము- నిత్యము సాయిని  కొలిచెదము   ||షిరిడీ||

భక్తీభావన తెలుసుకొని – సాయి ని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం- చెయ్యండి ప్రతినిత్యం
బాబాకాల్చిన ధునిఊది –నివారించును అదివ్యాధి
సమాధి నుండే శ్రీ సాయి- భక్తులను కాపాడవోయి              ||షిరిడీ||

మన ప్రశ్నలకు జవాబులు -  తెలుపును సాయి చరితములు
వినండీ లేక చదవండి- సాయి సత్యము చుడండి
సత్సంగము  చేయండి – సాయి స్వప్నమును పొందండి
బేధభావమును మానండి-సాయే మన సద్గురువండి    ||షిరిడీ||

వందనమయ్యా పరమేశా- ఆపద్భాంధవ సాయిశా
మా పాపములు కడతేర్చు- మా మది కోరిక నెరవేర్చు
కారుణామూర్తి ఓ సాయి- కరుణతో మముదరిచేర్చవోయి
మామనసే నీ మందిరము- మాపలుకులే నీకు నైవేద్యం  ||షిరిడీ||

 ||శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై ||


Click here to download



No comments:

Post a Comment